దుబాయ్-కోచి విమానంలో స్పృహతప్పిపోయిన మహిళ మృతి

- September 11, 2022 , by Maagulf
దుబాయ్-కోచి విమానంలో స్పృహతప్పిపోయిన మహిళ మృతి

దుబాయ్: విమాన ప్రయాణం మధ్యలో స్పృహ కోల్పోయిందా మహిళ.దీంతో కంగారు పడిన సిబ్బంది..విమానం ల్యాండవ్వగానే దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి ఆమెను తీసుకెళ్లారు.

కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.ఆస్పత్రికి వచ్చేసరికే ఆమె మరణించిందని వైద్యులు వెల్లడించారు.ఈ ఘటన దుబాయ్ నుంచి కోచి వస్తున్న విమానంలో వెలుగు చూసింది.

మిని (56) అనే మహిళ ఈ విమానంలో భారత్ వస్తోంది.అయితే విమాన ప్రయాణం మధ్యలో ఆమె కళ్లు తిరిగి పడిపోయింది.దాంతో విమానం కోచిలో ల్యాండవగానే సిబ్బంది హడావుడిగా ఆమెను దగ్గరలో ఉన్న ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.ఆమెది సహజ మరణమని డాక్టర్లు చెప్పడంతో ఈ ఘటనపై ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదని అధికారులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com