దుబాయ్ లో అర్బన్ టెక్ డిస్ట్రిక్ట్ పేరుతో కొత్త ప్రాజెక్ట్... 4 వేల మందికి ఉద్యోగాలు

- September 12, 2022 , by Maagulf
దుబాయ్ లో అర్బన్ టెక్ డిస్ట్రిక్ట్ పేరుతో కొత్త ప్రాజెక్ట్... 4 వేల మందికి ఉద్యోగాలు

యూఏఈ:  యూఏఈ కి చెందిన యూఆర్బీ అనే సంస్థ అతి పెద్ద కొత్త ప్రాజెక్ట్ ను చేపట్టింది. అర్బన్ టెక్ డిస్ట్రిక్ట్ పేరుతో తన కొత్త ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. ప్రపంచంలోని అతి పెద్ద అర్బన్ టెక్నాలజీ డిస్ట్రిక్ట్ ఇదేనని సంస్థ తెలిపింది. ఈ టెక్ డిస్ట్రి క్ట్ ద్వాారా కొత్త 4 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. దుబాయ్ లోని  అల్ జడాఫ్ క్రీక్‌సైడ్‌లో ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. టెక్నాలజీ,  విద్య , శిక్షణా రంగాల్లో నిపుణులకు ఇక్కడ ఉపాధి లభించనుంది. రానున్న దశాబ్ద కాలంలో టెక్ మార్కెట్ వేగంగా అభివృద్ది చెందుతుందని సంస్థ తెలిపింది. ఈ టెక్ డిస్ట్రిక్ట్ లో శిక్షణ, పరిశోధన, సెమినార్లు, బిజినెస్ ఇంక్యుబేషన్‌తో పాటు పలు సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ టెక్ హబ్ ను ఎలాంటి కార్బన ఉద్గారాలను రిలీజ్ చేయనుంది. పూర్తిగా పర్యావరణ ఫ్రెండ్లీగా ఇక్కడ పనులు జరగనున్నాయి. భవిష్యత్ లో అర్బన్ టెక్నాలజీ లో ఎంతో మంది నిపుణులు ఈ కొత్త ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచానికి పరిచయమవుతారని సంస్థ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com