ఉత్తమ నటి పూజా హెగ్దే: అందుకు ‘ఆమె’ అర్హురాలేనా.?
- September 12, 2022
తాజాగా విడుదల చేసిన సైమా అవార్డుల్లో భాగంగా ఉత్తమ నట అవార్డును దక్కించుకుంది బుట్టబొమ్మ పూజా హెగ్దే. ఈ విషయంలో సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అదేంటీ.? పూజా హెగ్దే ఉత్తమ నటి కాదా.?
అంటే, అందుకు రీజన్ లేకపోలేదు. 2021 సంవత్సరానికి గాను విడుదల చేసిన సైమా అవార్డుల్లో భాగంగా, పూజా హెగ్దేని ఈ అవార్డు వరించింది. బాగాన వుంది. కానీ, ఇదే సంవత్సరం సాయి పల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా కూడా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న సినిమాల లిస్టులో వుంది.
అసలు గొడవ ఇక్కడే మొదలైంది. సాయి పల్లవితో పోల్చితే, పూజా హెగ్దేని ఉత్తమ నటి అనగలమా.? ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాకి సంబంధించి పూజా హెగ్దేకి ఈ అవార్డు దక్కింది. ఈ సినిమాలో పూజా పాత్రతో పోల్చితే, ‘లవ్ స్టోరీ’లో సాయి పల్లవి పాత్ర అద్భుతం అని ప్రత్యేకంగా చెప్పాలా.?
మరి, సైమా లిస్టులో సాయి పల్లవి ఎందుకు చేరలేదు.? ఇక్కడా పాలిట్రిక్సే. తమకు వచ్చిన అవార్డుల్ని ప్రమోట్ చేసుకోగల సత్తా వుండి. ఈ అవార్డు ఫంక్షన్‌కి హాజరయ్యే ముద్దుగుమ్మలనే ఎంచుకుని వారికి అవార్డు ప్రధానం చేస్తారట. ఇదీ సైమా నియమమట.
ఈ నియమానికి కట్టుబడే సాయి పల్లవిని పక్కన పెట్టి, పూజా హెగ్దేని ఈ అవార్డు కోసం ఎంచుకున్నారన్న మాట. అయినా పిలిచి, అవార్డు ఇస్తామంటే సాయి పల్లవి రాకుండా వుంటుందా చెప్పండి.!
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!