సల్మాన్ పై మర్డర్ ప్లాన్స్.! ఆయనపై వాళ్లకెందుకంత కక్ష.!
- September 12, 2022
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌పై మర్డర్ ప్లాన్స్ జరుగుతున్నాయ్. గతంలో ఓసారి ఇలాగే బెదిరింపు కాల్స్ వస్తే, తృటిలో తప్పించుకుని అలర్ట్ అయ్యాడు సల్మాన్ ఖాన్. ఆ తర్వాత నుంచీ పోలీసుల అనుమతి లేకుండా అనవసరంగా బయటికి కదలడం లేదాయన.
అంతేకాదు, అప్పటి నుంచీ తన వద్ద లైసెన్స్‌డ్ గన్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు సల్మాన్ ఖాన్. ముంబయ్ ప్రముఖ గ్యాంగ్ స్టర్‌గా పేరొందిన లారెన్స్ బిష్ణోయ్ నుంచి ఆయన తండ్రికి బెదిరింపు కాల్స్ వచ్చాయ్. దాంతో సల్మాన్ ఖాన్ అలెర్ట్ అయ్యి పోలీసులనాశ్రయించాడు.
తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్‌పై మర్డర్ ప్లానింగ్ నేపథ్యంలో రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. లారెన్స్ ప్రోద్భలంతోనే ఈ రెక్కీ నిర్వహించారట. అయితే, ఈ సారి కూడా సల్మాన్ అలెర్ట్ అయ్యాడు. ఈ సారి ఇంకాస్త జాగ్రత్త తీసుకున్నాడు.
అత్యవసర పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తన రక్షణ నిమిత్తం పోలీసులకు ముందస్తుగా ఇన్‌ఫామ్ చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. అలాగే షూటింగుల్లోనూ పోలీసుల రక్షణ తీసుకుంటున్నాడట.
ఇక, సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తెలుగులో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవికి స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో కీలక రోల్ పోషిస్తున్నాడు. అక్టోబర్‌లో ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా వుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?