సికింద్రాబాద్ అగ్నిప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి
- September 13, 2022
న్యూఢిల్లీ: సికింద్రాబాద్లోని రూబీ లాడ్జిలో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ఇస్తామని వెల్లడించారు.
కాగా, రూబీ లాడ్జ్ సెల్లార్ లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. సెల్లార్ లోని ఎలెక్ట్రిక్ స్కూటర్ల షోరూంలో ఈ-బైకులు పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. లాడ్జిలోని మొదటి, రెండో ఫ్లోర్లలో ఉన్న వారు ఊపిరి ఆడక చనిపోయినట్టు తెలుస్తోంది. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పై నుంచి కిందకు దూకిన కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదంపై స్పందించిన ప్రధాని.. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు