కువైట్ లో సిగరెట్లు విక్రయిస్తున్న వాహనాలు సీజ్

- September 13, 2022 , by Maagulf
కువైట్ లో సిగరెట్లు విక్రయిస్తున్న వాహనాలు సీజ్

కువైట్: మునిసిపాలిటీ సహకారంతో నువైసీబ్ పోర్ట్‌లో 15 ప్రైవేట్ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు మేజర్ జనరల్ వాలిద్ అల్-షెహాబ్ నేతృత్వంలోని అల్-అహ్మదీ సెక్యూరిటీ డైరెక్టరేట్ తెలిపింది. ఈ వాహనాల యజమానులు లైసెన్స్ లేకుండా పోర్ట్ వెంట వెళుతున్న వ్యక్తులకు పెద్ద మొత్తంలో సిగరెట్లను విక్రయిస్తున్నారని డైరెక్టరేట్ పేర్కొంది. చట్టాలను ఉల్లంఘించినందుకు సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు, వాహన యజమానులను మున్సిపాలిటీకి రెఫర్ చేసినట్లు అల్-అహ్మదీ సెక్యూరిటీ డైరెక్టరేట్ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com