వీఆర్ఏలతో ముగిసిన కెటిఆర్‌ భేటి..

- September 13, 2022 , by Maagulf
వీఆర్ఏలతో ముగిసిన కెటిఆర్‌ భేటి..

హైదరాబాద్: అసెంబ్లీలో వీఆర్ఏలతో మంత్రి కెటిఆర్ చర్చలు ముగిశాయి. కెటిఆర్ తో పాటు సీఎస్ తో చర్చించామని వీఆర్ఏలు తెలిపారు. 23 వేల మంది వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని కెటిఆర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. పే స్కేల్… అర్హులకు ప్రమోషన్లు… 55 సంవత్సరాలు దాటిన వారి వారసులకు ఉద్యోగాలపై మంత్రితో చర్చించినట్లు తెలిపారు వీఆర్ఏలు. సమ్మె విరమించమని కెటిఆర్ తెలిపారన్న వీఆర్ఏలు…అయితే సమ్మె విరమించేది మాత్రం అందరితో చర్చించిన తర్వాతేనన్నారు. సీఎం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని.. ఈ నెల 18 తేది వరకు సమయం ఇవ్వాలని కెటిఆర్ కోరినట్లు వీఆర్ఏలు తెలిపారు.

కాగా, అంతకు ముందు వీఆర్ఏల ఛలో అసెంబ్లీ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. నిరసన తెలియజేసేందుకు పెద్ద సంఖ్యలో వీఆర్ఏలు హైదరాబాద్ కు తరలి వచ్చారు . సమస్యల పరిష్కారానికి చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు. ఇందిపార్క్ నుంచి అసెంబ్లీ వరకు వందలాది మంది వీఆర్ఏలు ర్యాలీగా బయలు దేరారు. అసెంబ్లీ వైపు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. తెలుగు తల్లి ప్లై ఓవర్ దగ్గర వీఆర్ఏలను పోలీసులు అడ్డుకున్నారు . దీంతో అక్కడే బైఠాయించిన వీఆర్ఏలు సర్కార్ కు వ్యతిరేంగా నినాదాలు చేశారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అయితే వీఆర్ఏలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు . దీంతో తెలుగు తల్లి ప్లై ఓవర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ధర్నాలో వందలాది మంది వీఆర్ఏలు పాల్గొన్నారు. పోలీసులకు, వీఆర్ఏలకు మధ్య తోపులాట జరిగింది. వెంటనే కెసిఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు వీఆర్ఏలు. పే స్కేల్ ప్రకటించాలన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com