బిగ్‌బాస్: ఊరించి తుస్ మనిపించాడు.! ఈ సారి మాత్రం డబుల్ ధమాకా.!
- September 13, 2022
బిగ్‌బాస్ గేమ్ షోకి వున్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెర ప్రేక్షకులకు బిగ్‌బాస్ షో స్టార్టవుతుందంటే చాలు. ఎక్కడ లేని వుత్సాహం అలుముకుంటుంది. ఎప్పుడూ జరిగే గొడవలే.. ఎప్పుడూ వుండే కాంట్రవర్సీలే, కంటెస్టెంట్ల మధ్య పోలికలూ కామనే.. అయినా కానీ, బిగ్‌బాస్‌కున్న క్రేజ్ వేరే లెవల్ అంతే.!
తాజాగా బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి వారం గడిచింది. తొలి వారం ఎలిమినేషన్ కోసం జరిగే నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. అలాగే ఎలిమినేషన్ డే కూడా అంతే ఆసక్తికరంగా నడిచింది.
తీరా వీకెండ్ వచ్చేసరికి నో ఎలిమినేషన్ అంటూ తుస్ మనిపించాడు నాగార్జున. ఈ విషయం ముందుగానే లీకు వీరులు ఈ విషయాన్నిబయట పెట్టేశారు. కానీ, ఏదో క్యూరియాసిటీ. ఏమో గుర్రం ఎగరా వచ్చు.. అని. కానీ లీకు వీరుల మాటే చెల్లింది.
ఇక, ఇప్పుడు మళ్లీ నామినేషన్లు జరిగాయ్. హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేందుకు కొందరు కంటెస్టెంట్లు రెడీ అయ్యారు. అయితే, ఈ సారి ఎలిమినేషన్ ప్రోసెస్‌పై కూడా కొన్ని లీకులు షురూ అయ్యాయ్. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ వుంటుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం కూడా నిజమవుతుందా.? చూడాలి మరి.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







