ఎయిర్పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు
- September 14, 2022
ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు AAI యొక్క http://aai.aeroవెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా తమ దరఖాస్తులను సమర్పించుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే అంటే సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్ (AAI రిక్రూట్‌మెంట్ 2022) ప్రక్రియ ద్వారా మొత్తం 156 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఖాళీలు విద్యార్హతల వివరాలు: మొత్తం నాలుగు విభాగాల్లో 156 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) : అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 3 సంవత్సరాల ఆటోమొబైల్ లేదా మెకానికల్ డిప్లొమా లేదా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్): ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలి.
సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్): 3 లేదా 6 నెలల కంప్యూటర్ సర్టిఫికేట్‌తో గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుండి కామర్స్‌లో గ్రాడ్యుయేట్ పట్టా పొంది ఉండాలి.
సీనియర్ అసిస్టెంట్ (Official Language): ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి హిందీ లేదా ఆంగ్లంలో గ్రాడ్యుయేట్‌తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
కనిష్ట వయో పరిమితి: 18 సంవత్సరాలు
గరిష్ట వయో పరిమితి: 30 సంవత్సరాలు
AAI రిక్రూట్‌మెంట్ 2022 ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 1
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 30
తాజా వార్తలు
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు







