లండన్‌కు చేరుకున్న క్వీన్ ఎలిజబెత్–2 పార్థివదేహాం..
- September 14, 2022
లండన్: క్వీన్ ఎలిజబెత్–2 పార్థివదేహాం స్కాట్ లాండ్ లోని ఎడిన్ బరో నుంచి గత రాత్రి సైనిక రవాణా విమానంలో లండన్ కు చేరింది. క్వీన్ శవపేటికను కింగ్ ఛార్లెస్.. ఆయన భార్య కెమిల్లా అందుకున్నారు. క్వీన్ డెడ్ బాడీని బకింగ్ హం ప్యాలెస్ లోని బౌ రూంలో ఉంచారు. రాజవంశీయులందరూ నివాళులు అర్పిస్తున్నారు. క్వీన్ గార్డెన్స్, దమాల్, హార్స్ గార్డ్స్, వైట్ హాల్, పార్లమెంటు స్ట్రీట్, పార్లమెంట్ స్క్వేర్, న్యూ ప్యాలెస్ యార్డ్ మీదుగా శవపేటికను ఊరిగేంపుగా.. పార్లమెంటు బిల్డింగ్ వెస్ట్ మినిస్టర్ కు తరలిస్తారు. ఇందుకోసం సన్నాహాలు పూర్తయ్యాయి. సోమవారం నుంచి సందర్శనకు అనుమతించనున్నారు. వెన్స్ట మినిస్టర్ నుంచి స్థానిక టవర్ బ్రిడ్జి వరకూ సుమారు 5 కిలోమీటర్ల క్యూ ఏర్పడుతుందని భావిస్తున్నారు. క్వీన్ ఎలిజబెత్–2 అంత్యక్రియలు సెప్టెంబర్ 19న జరగనున్నాయి. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
పపువా న్యూగినియా నేతలు క్వీన్ ఎలిజిబెత్ కు నివాళి కార్యక్రమం ఏర్పాటు చేశారు. కింగ్ ఛార్లెస్–3 ని తమ రాజ్యాధినేతగా ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా, దాని మిత్రదేశ బెలారస్, సైనిక పాలన ఉన్న మయన్మార్ దేశాలకు క్వీన్ అంత్యక్రియలకు ఆహ్వానం పంపలేదని… స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి.
తాజా వార్తలు
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్‌లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్‌గ్రౌండ్‌లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం