అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం: లిఫ్ట్ కూలి 8 మంది కూలీలు మృతి
- September 14, 2022
గుజరాత్: గుజరాత్ అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ కూలి 8 మంది కూలీలు మృతి చెందారు. ఈ ఘటన గుజరాత్ యూనివర్సిటీకి సమీపంలో చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆస్పైర్-2 భవనంలో ఈరోజు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
“కూలీలతో వెళ్తున్న లిఫ్ట్.. 7వ అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కు ఒక్కసారిగా పడిపోవడంతో అందులో ఉన్న 8 మంది మరణించినట్లు తెలుస్తుంది. మృతులంతా ఘోఘంబ ప్రాంతానికి చెందిన రోజువారీ కూలీలు” అని అహ్మదాబాద్ జోన్ 1 డిప్యూటీ కమిషనర్ లవీనా సిన్హా తెలిపారు. అయితే ఈ ఘటనపై తమకు భవన యజమానులెవరూ సమాచారం అందించలేదని, మీడియా ద్వారా తెలిసిందని అగ్నిమాపక దళం ఇన్‌ఛార్జి జయేశ్ ఖాడియా తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నామని, కూలీల మృతదేహాలను స్థానిక వీఎస్ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. రక్షణపరమైన లోపం వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







