ప్రపంచంలోనే తొలిసారిగా.. యూఏఈలో పేపర్‌లెస్ ట్యాక్స్ రీఫండ్ స్కీమ్
- September 14, 2022
యూఏఈ: పర్యాటకుల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి పేపర్‌లెస్ ట్యాక్స్ రీఫండ్ స్కీమ్‌ను యూఏఈ ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA) ప్రకటించింది. కొత్త స్కీమ్ లో భాగంగా టూరిస్టులు తమ కొనుగోళ్లకు సంబంధించిన పేపర్ బిల్స్ ను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA) డైరెక్టర్ జనరల్ ఖలీద్ అలీ అల్ బుస్తానీ తెలిపారు. అన్ని దుకాణందారుల వివరాలను ఆన్ లైన్ చేయడంతోపాటు కొనుగోళ్లకు సంబంధించిన బిల్స్ ఎలక్ట్రానిక్‌గా రూపొందించబడతాయని, VAT రీఫండ్ క్లెయిమ్ చేయడం ఇక టూరిస్టులకు సులువవుతుందని ఆయన వివరించారు. FTA ప్లానెట్ టాక్స్ సీనియర్ అధికారులు హాజరైన సమావేశంలో అల్ బుస్తానీ మాట్లాడారు. 2018లో ఐదు శాతం విలువ ఆధారిత పన్ను (VAT)ని యూఏఈ ప్రవేశపెట్టింది. దేశంలోని పర్యాటకులు దేశం విడిచి వెళ్లినప్పుడు అవుట్‌లెట్‌లలో చేసిన కొనుగోళ్లపై VAT రీఫండ్ క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్లానెట్ టాక్స్ దేశంలో వ్యాట్ రీఫండ్‌ల కోసం దాదాపు 100 కియోస్క్‌లను కూడా నిర్వహిస్తోంది. ఈ పేపర్‌లెస్ ట్యాక్స్ రీఫండ్ స్కీమ్ అమలుతో పేపర్ కోసం వినియోగించే 16,000 చెట్లను రక్షించినట్లు అవుతుందని అల్ వుస్తానీ అన్నారు.
తాజా వార్తలు
- CBSE 10th, 12th ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారు..
- అవార్డులు గెలుచుకున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
- ఏపీలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు..!
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!