'కృష్ణ వ్రింద విహారి' టైటిల్ సాంగ్ విడుదల
- September 14, 2022
హైదరాబాద్: యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న తాజా చిత్రం కృష్ణ వ్రింద విహారి నుండి టైటిల్ సాంగ్ రిలీజ్ వచ్చింది. ఆర్. కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్ శంకర ప్రసాద్ ముల్పూరి సమర్పణలో హీరో నాగశౌర్య తల్లి ఉషా ముల్పూరి ఈ మూవీని నిర్మించారు. షిర్లీ సేటియా హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. రోమ్ కోమ్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 23న భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ తరుణంలో చిత్ర మేకర్స్ టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసారు.
” గుడు గుడు గుంజం గోవిందా టార్చర్ ఇట్లా ఉంటుందా” అంటూ ఈ పాట నడుస్తోంది. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను రామ్ మిర్యాల ఆలపించాడు. ప్రేమించిన అమ్మాయి కోసం హీరో పడే పాట్లపై ఈ టైటిల్ సాంగ్ కొనసాగింది. రొమాంటిక్ లవ్ స్టోరీ గా తిరిగెక్కుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటి రాధిక కీలకపాత్ర పోషించారు. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మాజీ, సత్య, తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!







