బిగ్‌బాస్ సన్నీ హీరోగా ‘సకల గుణాభిరామ’.!
- September 14, 2022
బిగ్‌బాస్ గేమ్ షోకి వున్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెప్యుటేషన్‌తో పని లేకుండా, ఆ షో విపరీతంగా క్రేజ్ దక్కించుకుంటుంటుంది. అదే క్రేజ్‌ని తాను కూడా క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు గత సీజన్ విన్నర్ సన్నీ. ప్రస్తుతం బిగ్‌బాస్ ఆరో సీజన్ నడుస్తోంది. ఈ టైమ్‌లో సన్నీ హీరోగా తెరకెక్కిన సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
బిగ్‌బాస్ ఐదో సీజన్ విన్నర్ అయిన సన్నీ హీరోగా తెరకెక్కిన సినిమా ‘సకల గుణాభిరామ’. ఈ శుక్రవారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అషిమా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా, శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వం వహిస్తున్నారు.
వీజెగా కెరీర్ స్టార్ట్ చేసిన సన్నీ, తర్వాత యాంకర్‌గానూ, సీరియల్ ఆర్టిస్టుగానూ తనదైన ముద్ర వేసుకున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా తనదైన గేమ్ ఆడాడు. ఆటలో జెన్యూనిటీ చూపించాడు సన్నీ.
ఆ జెన్యూనిటీ మెచ్చిన ప్రేక్షకులు బిగ్‌బాస్ విన్నర్‌గా సన్నీని నిలబెట్టారు. అలా పాపులర్ అయిన సన్నీతో సంజీవరెడ్డి అనే ప్రొడ్యూసర్ ఓ సినిమా నిర్మించాడు. అదే ‘సకల గుణాభిరామ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని చాలా గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ ఈవెంట్‌కి బిగ్ బాస్ కంటెస్ట్లెంట్లు అయిన రవి, సోహెల్ తదితరులు వచ్చి, హీరో అయినందుకు సన్నీని అభినందించారు. మేం తీర్చుకోలేని కోరిక సన్నీ తీర్చుకున్నాడు. ఈ సినిమా సన్నీకి మంచి బ్రేక్ ఈవెన్ కావాలని ఆశీర్వదించారు. మొత్తానికి బిగ్‌బాస్ హౌస్‌లో వున్నప్పుడు ఆడియన్స్ చేత హీరో అనిపించుకున్న సన్నీ, ఎట్టకేలకు తన గోల్ రీచ్ అయ్యాడు. సక్సెస్ అవుతాడా.? లేదా.? అనేది చూడాలి మరి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







