ఖర్కివ్‌లో శవాల దిబ్బలు..
- September 16, 2022
కీవ్: ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రష్యా సేనల అధీనంలో ఉన్న దేశంలోని రెండో అతిపెద్ద పట్టణమైన ఖర్కివ్‌ను ఉక్రెయిన్ దళాలు మళ్లీ స్వాధీనం చేసుకున్నాయి. ఈ సందర్భంగా నగరాన్ని పరిశీలించగా ఇజియం ప్రాంతంలో శవాల దిబ్బలు కనిపించాయి. ఇక్కడి శివారు అటవీ ప్రాంతంలోని ఓ గొయ్యిలో 440కి పైగా మృతదేహాలు బయటపడ్డాయి. సీనియర్ దర్యాప్తు అధికారి ఒకరు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. మృతుల్లో చాలామంది తుపాకి తూటాలకు బలికాగా, మరికొందరు క్షిపణులు, వైమానిక దాడుల కారణంగా మరణించి ఉంటారని ఆయన పేర్కొన్నారు. చంపడానికి ముందు వారిని హింసించిన గుర్తులు కూడా ఉన్నాయని అన్నారు.
అలాగే, అదే ప్రాంతంలో ఒక చోట 17 మంది ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలు కూడా ఉన్నట్టు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ పేర్కొంది. వీరిని పూడ్చిన ప్రాంతం చుట్టూ వందలాది చిన్నచిన్న సమాధులు ఉన్నట్టు ఆ కథనం పేర్కొంది. ఖర్కివ్ తిరిగి ఉక్రెయిన్ చేతుల్లోకి వచ్చిన తర్వాత అధ్యక్షుడు జెలెన్ స్కీ సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. రష్యా ప్రతి చోటా మరణశాసనం రాసిందన్నారు. అప్పట్లో బుచా, మేరియుపోల్ తర్వాత ఇప్పుడు ఖర్కివ్ అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి రష్యానే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్‌ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్‌లు
- బీచ్‌లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి