దుబాయ్ లో మూన్ రిసార్ట్....
- September 16, 2022
దుబాయ్: దుబాయ్ కి ముఖ్య ఆదాయ రంగం పర్యాటకం.భవిష్యత్తులో దుబాయ్ ని అత్యంత ఆకర్షణీయ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అక్కడి పాలకులు చర్యలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో, ఇక్కడి మీనా ప్రాంతంలో మూన్ దుబాయ్ పేరిట సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు.
ఇది అచ్చం చంద్రుడి ఉపరితలంపై ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.పర్యాటకులకే కాదు, అంతరిక్ష పరిశోధన సంస్థలు కూడా ఇక్కడ తమ వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేందుకు అనువుగా దీన్ని తీర్చిదిద్దనున్నారు.
మాథ్యూస్ అండ్ హెండర్సన్ మూన్ వరల్డ్ రిసార్ట్స్ ఓ ప్రకటనలో దీనిపై స్పందిస్తూ... మూన్ దుబాయ్ అతిపెద్ద, అత్యంత విజయవంతమైన ఆధునిక కాలపు టూరిజం ప్రాజెక్టు అవుతుందని వెల్లడించింది.ఈ మూన్ ప్రాజెక్టు వల్ల వార్షిక పర్యాటకుల సంఖ్య రెట్టింపవుతుందని తెలిపింది.
కాగా, ఈ మూన్ రిసార్ట్ ను 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. స్పేస్ టూరిజంపై ఆసక్తి ఉన్నవారికి, ఖర్చు భరించగలిగిన వారికి ఇక్కడి లూనార్ కాలనీ అద్భుతమైన అనుభూతి కలిగిస్తుంది. చంద్రుడిపై ఎలా ఉంటుందో, అలాంటి వాతావరణాన్నే ఇక్కడ సృష్టించనున్నారు.
దాంతోపాటు ఇక్కడ 300 ప్రైవేటు నివాస గృహాలు కూడా ఉంటాయట. కొద్దిపాటి స్థలంలోనే అధిక సంఖ్యలో గృహాల నిర్మాణం కోసం స్కై విల్లాస్ పేరిట డిస్క్ ఆకారంలో భవన నిర్మాణం చేపట్టనున్నారు.
ఇప్పటికే బుర్జ్ ఖలీఫా వంటి భారీ నిర్మాణంతో ప్రపంచ పటంలో యూఏఈకి ప్రత్యేక స్థానం లభించగా, ఆ స్ఫూర్తితోనే ఈ మూన్ దుబాయ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది.
--నరేష్ బాబు


తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







