రేపు హైదరాబాద్ లో కేసీఆర్ బహిరంగ సభ..

- September 16, 2022 , by Maagulf
రేపు హైదరాబాద్ లో కేసీఆర్ బహిరంగ సభ..

హైదరాబాద్: తెలంగాణ లో బిజెపి ..టిఆర్ఎస్ పార్టీ లు ఎక్కడ తగ్గడం లేదు. ఇరు పార్టీలు నువ్వా..నేనా అన్నట్లు సభలు , సమావేశాలు జరుపుతున్నాయి. రేపు సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్స్ లో బిజెపి తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరుపుతుంటే..టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుండి మూడు రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైఖ్య వజ్రోత్సవాల పేరిట వేడుకలు జరుపుతుంది. ఇందులో భాగంగా రేపు హైదరాబాద్​లోని ఎన్టీఆర్ స్టేడియంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పటు చేస్తున్నారు. ఈ సభకు 33 జిల్లాల నుండి 2300 బస్సులలో 1 లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

మరోపక్క కాంగ్రెస్ తెలంగాణ స్వతంత్ర దినోత్సవం పేరుతో కార్యక్రమాల నిర్వహణకు సిద్దమైంది. అటు ఎంఐఎం కూడా శనివారం పాతబస్తీలో జాతీయ జెండాలు చేతపట్టి భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో.. ఇప్పుడు అన్ని పార్టీలు సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణలో తమ పట్టు నిరూపించుకొనేందుకు.. రాజకీయంగా ప్రత్యర్ధి పార్టీల పైన పై చేయి సాధించేందుకు కార్యచరణ సిద్దం చేసుకున్నాయి.

ఇక కేసీఆర్ సభ కారణంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్​ పోలీసులు ఆంక్షలు విధించనున్నారు. కావున ప్రజలు, ప్రయాణికులు తమకు సహకరించాలని పోలీసులు కోరారు. ప్రతి జిల్లా నుంచి ఎన్​టీఆర్​ స్టేడియానికి 2,300 బస్సుల్లో దాదాపు లక్ష మంది ప్రజానికం వస్తారని ట్రాఫిక్​ వారు భావిస్తున్నారు. అందువల్ల నగరంలో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్​ మళ్లింపులు ఉంటాయన్నారు. తెలంగాణ విమోచన వేడుకలు కారణంగా జరిగే బహిరంగసభకు పెద్దఎత్తున ప్రజలు రావడంతో ఎన్​టీఆర్​ స్టేడియానికి వెళ్లే మార్గాల్లో ఉన్న హైదరాబాద్‌ సెంట్రల్ జోన్‌, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయని ట్రాఫిక్​ పోలీసులు తెలిపారు. ఇందిరాపార్కు చుట్టూ 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్ లోని 9 జంక్షన్ లను ప్రయాణికులు రూట్ మార్చుకోవాలి.. కవాడి గూడ, అశోక్ నగర్, ముషీరాబాద్, ఇందిరా పార్కు..లిబర్టీ, నారాయణ గూడ, రాణిగంజ్, నెక్ లెస్ రోడ్, పలు ఏరియా జంక్షన్ లలో ట్రాఫిక్ పూర్తిగా మల్లింపు ఉంటుందని వెల్లడించారు జాయింట్ సిపి రంగనాథ్. ఎన్టీఆర్ ఘాట్, అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కళాకారుల ప్రదర్శనలు ఉండడంతో ఆ ప్రాంతంలో వచ్చే వాహనాలకు అనుమతిలేదని, ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com