మంకీపాక్స్ అత్యవసర ప్రణాళికలపై చర్చించిన బహ్రెయిన్
- September 17, 2022
మనామా: మంకీపాక్స్‌ను ఎదుర్కోవడానికి అత్యవసర సమావేశాన్ని ఆరోగ్య మంత్రి డాక్టర్ జలీలా బింట్ సయ్యద్ జవాద్ హసన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంకీపాక్స్ ను ఎదర్కొనే ప్రణాళికలపై చర్చించారు. స్థానికంగా, అంతర్జాతీయంగా అమలులో ఉన్న హెల్త్ ప్రోటోకాల్‌లకు అనుగుణంగా.. అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆరోగ్య మంత్రి జవాద్ హసన్ ఆదేశించారు. బహ్రెయిన్‌లో మొదటి కేసు నమోదుపై మంత్రి స్పందించారు. మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ఎపిడెమియోలాజికల్ నిఘా కొనసాగుతోందన్నారు. ఆరోగ్య నిపుణులు అవగాహన క్యాంపెయిన్ లను విస్తృతం చేయాలని ఆదేశించారు. వీటితోపాటు పరీక్ష, ఐసోలేషన్, చికిత్స, కాంటాక్ట్ ట్రేసింగ్‌కు సంబంధించి చర్యలపై ఆయన సమీక్షించారు. కమ్యూనిటీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్లలో అనుమానిత కేసుల పర్యవేక్షణ, వ్యాక్సిన్లు అందించే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని అధికారులను ఆరోగ్య మంత్రి జవాద్ హసన్ ఆదేశించారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







