బాలీవుడ్ బాద్షా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన లెఫ్టినెంట్ రామ్.!
- September 17, 2022
లెఫ్టినెంట్ రామ్‌కి అస్సలు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే, ఇప్పుడీ పేరుకు అసలు పరిచయమే అక్కర్లేదు. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా ఈ పేరు మార్మోగిపోయింది. ఇంకా మార్మోగుతూనే వుంది. ఇంతకీ లెఫ్టినెంట్ రామ్ గురించి ఎందుకంటారా.?
అదేనండీ ‘సీతారామం’ సినిమాలో లెఫ్టినెంట్ రామ్ పాత్ర పోషించాడు దుల్కర్ సల్మాన్. దుల్కర్ సల్మాన్ అనే పేరు కన్నా, లెఫ్టినెంట్ రామ్ అనే పేరుకే ఎక్కువ పాపులారిటీ, క్రేజీ దక్కింది ఇటీవల. ‘యుధ్దంతో రాసిన ప్రేమకథ’ అంటూ ‘సీతారామం’ సినిమాకి విడుదలైన అన్ని చోట్లా అపారమైన ఆదరణ దక్కుతోంది.
సరే, అసలు విషయానికి వచ్చేద్దాం. ఇప్పుడీ సినిమా బాలీవుడ్లో రిలీజై రికార్డులు కొల్లగొడుతోంది. ఈ నేపథ్యంలోనే దుల్కర్‌ని నార్త్ జనం షారూఖ్ ఖాన్‌తో పోల్చుతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారట.
అందుకు దుల్కర్ సల్మాన్, ‘షారూఖ్ ఖాన్ ఓ లెజెండరీ ఆయనతో దయచేసి నన్ను పోల్చవద్దు. ఆయనకు నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను..’ అని షారూఖ్‌పై అబిమానం వ్యక్తం చేశాడు దుల్కర్ సల్మాన్.
అంతేకాదు, షారూఖ్‌కి కేవలం నటుడుగా మాత్రమే కాదు, గొప్ప వ్యక్తిగా దుల్కర్ సల్మాన్ అభివర్ణిస్తున్నారు. ఎంతమందిలో వున్నా అభిమానుల్ని పలకరించాల్సి వస్తే, ఆయన ఎంతో చొరవ చూపిస్తారనీ దుల్కర్ చెప్పాడు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







