తమన్నాని ఇంప్రెస్ చేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్: ఎట్టకేలకు టాలెంట్ బయటికి.!

- September 19, 2022 , by Maagulf
తమన్నాని ఇంప్రెస్ చేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్: ఎట్టకేలకు టాలెంట్ బయటికి.!

బిగ్‌బాస్ వీకెండ్ షో భాగంగా, కొత్త గెస్ట్‌ని ఆహ్వానిస్తూ, హౌస్‌లోకి పంపించడం ద్వారా కొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌కి తెర లేపుతున్నాడు హోస్ట్ నాగార్జున. ఈ నేపథ్యంలో తాజా వీకెండ్‌కి మిల్కీ బ్యూటీ తమన్నా తళుకులతో హౌస్‌కి కొత్త కళ తీసుకొచ్చాడు నాగార్జున.
తమన్నాని చూసిన కంటెస్టెంట్లు ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యారు. తమలో దాగున్న టాలెంట్లను బయటికి తీసి, తమన్నాకే కాదు, వీక్షకులనూ మెస్మరైజ్ చేశారు. అందులో భాగంగా, సింగర్ రేవంత్ తమన్నా కోసం ఓ పాట పాడగా, మరో కంటెస్టెంట్ ఆర్జే సూర్య మాత్రం తనదైన శైలిలో తమన్నాని ఇంప్రెస్ చేశాడు.
ఆర్జే సూర్య మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అన్న సంగతి తెలిసిందే. ప్రముఖంగా విజయ్ దేవరకొండ వాయిస్‌తో ఆర్జే సూర్య బాగా పాపులర్ అయ్యాడు బుల్లితెరపై. దాంతో బిగ్ హౌస్‌లో ఆయనపై బాగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు ప్రేక్షకులు. 
కానీ, ఇంతవరకూ ఆ కళలేం ప్రదర్శించలేదు సూర్య. ప్లెయిన్ గేమ్‌తో సరిపెట్టుకున్నాడు. దాంతో, ఆర్జే సూర్యను సోషల్ మీడియాలో నెగిటివ్‌గా ట్రోల్ చేయడం కూడా మొదలెట్టేశారు నెటిజన్లు. కానీ, తమన్నా పుణ్యమా అని, ఆర్జే సూర్య తనలోని టాలెంట్లన్నీ బయట పెట్టాడు.
కేవలం విజయ్ దేవరకొండ వాయిస్ మాత్రమే, ప్రబాస్, పవన్ కళ్యాణ్ వాయిస్‌లను సైతం పర్ఫెక్ట్‌గా ఇమిటే్చేసి, అటు తమన్నా దగ్గరా, ఇటు ఆడియన్స్ దగ్గర కూడా మంచి మార్కులు కొట్టేశాడు సూర్య.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com