బిగ్ బ్రేకింగ్: ఇనయా.! ఈ వారం ఔటేనా.?
- September 20, 2022
వర్మగారి హీరోయిన్గా పాపులర్ అయిన ముద్దుగుమ్మ ఇనయా సుల్తానా. బిగ్‌హౌస్‌లో తనను తాను బాగానే ఎలివేట్ చేసుకుంటూ వస్తోంది. గయ్యాలీ నోటితో బాగానే డిఫెన్స్ ఇస్తోంది. డే వన్ నుంచీ అదే ఎనర్జీతో తన వంతు పర్ఫామెన్స్ ఇస్తోంది ఇనయా సుల్తానా.
కానీ, ఎందుకో ఇనయాపై నెగిటివిటీ ఎక్కువగా వుంది. మొదటి వారమే ఇనయా హౌస్ నుంచి వెళ్లిపోతుందనే ప్రచారం గట్టిగా జరిగింది. కానీ, ఫస్ట్ వీక్ నో ఎలిమినేషన్‌తో ఇనయా తప్పించుకుంది. ఆ తర్వాత సెకండ్ వీక్‌లోనూ ఇనయా ఎలిమినేషన్ లిస్టులో వుంది.
కానీ, అనూహ్యంగా అభినయ శ్రీని హౌస్ నుంచి బయటికి గెంటేసి, ఇనయా సుల్తానాని సేవ్ చేశారు ఎందుకో. బయటికి వచ్చిన అభినయశ్రీ అదే గోడు వెల్లిబుచ్చుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఓటింగ్ ప్రకారం, ఇనయాతో పోల్చితే, తను టాప్‌లో వున్నాననీ, అన్యాయంగా లాస్ట్ మినిట్‌లో నన్ను ఎలిమినేట్ చేసేశారనీ అభినయశ్రీ వాపోయింది.
బిగ్‌బాస్ తనకు అన్యాయం చేసిందనీ అభినయ శ్రీ ఆరోపించింది. ఇక మూడో వారం నామినేషన్ల లిస్టులోనూ ఇనయా సుల్తానా పేరుంది. సో, ఇక ఈ వారం ఎలిమినేషన్ నుంచి ఇనయా తప్పించుకోవడం సాధ్యం కాదంటూ లీకు వీరుల నుంచి అందుతోన్న గట్టి సమాచారం. మరి, ఈ వారమైనా ఇనయాని బయటకి పంపిస్తారా.? లేక, ఆమె స్థానంలో ఇంకెవరైనా బలి అవుతారా.? చూడాలి మరి.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







