‘పవర్’ పంచ్: సమయం లేదు మిత్రమా.! సినిమానా.? రాజకీయమా.?
- September 20, 2022
ఓ వైపు సినిమా ఇంకో వైపు రాజకీయం.. ఇలా రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు ఓకే చేసి పెట్టేశారు. ఆల్రెడీ ఓ సినిమా ‘హరి హర వీరమల్లు’ సెట్స్‌పై వుంది. ఎప్పుడో కంప్లీట్ అయిపోవల్సిన ఈ సినిమా ఇండస్ర్టీలో అల్లుకున్న అననుకూల పరిస్థితుల కారణంగా ఆలస్యమవుతూ వస్తోంది.
ఇక, మరో రీమేక్ సినిమా ‘వినోదయ సితం’ కూడా సెట్స్ మీదికి తీసుకెళ్లాలి. కానీ, కుదరలేదు. అలాగే ‘భవదీయుడు భగత్ సింగ్’ స్క్రిప్ట్ చేతిలో పట్టుకుని, యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడు.
మరోవైపు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ జోరు పెంచాల్సిన సమయం వచ్చేసింది. ఎలక్షన్ మోడ్ ఆన్‌లోకి వచ్చేసింది. ఈ తరుణంలో జనంలో నిరంతరంగా తిరగాలి పవన్ కళ్యాణ్. వాస్తవానికి దశమి నాటికే తాను కమిట్ అయిన సినిమా ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి, ఫుల్ ఫోకస్ రాజకీయాలపై పెట్టాలని అనుకున్నాడు పవన్ కళ్యాణ్.
అందులో భాగంగానే ఆంధ్ర ప్రదేశ్‌లో బస్సు యాత్రకు సన్నాహాలు కూడా చేశారు. కానీ, పరిస్థితి చూస్తుంటే అందుకు అనుకూలంగా కనిపించడం లేదు. మరి, అనుకున్న టైమ్‌లోగా పవన్ కళ్యాణ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకుని రాజకీయ రధం ఎక్కుతారా.? చూడాలి మరి. ఫ్యాన్స్‌లో ఉత్సుకత, దానికి తోడు టెన్షన్ కూడా పెరిగిపోతోంది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్‌కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్‌లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్‌లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







