చిరంజీవిని అసహనానికి గురి చేస్తున్న ‘గాడ్ ఫాదర్’.!
- September 20, 2022
‘గాడ్ ఫాదర్’ సినిమాపై భయంకరమైన నెగిటివిటీ ప్రచారం జరుగుతోంది. మొన్నీ మధ్య రిలీజ్ చేసిన ఓ సాంగ్ ప్రోమోకి సంబంధించి ఫుల్ వీడియో సాంగ్ అనుకున్న డేట్‌కి రిలీజ్ కాలేదు. టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఆ వీడియో రిలీజ్ చేయలేకపోయామంటూ చిత్ర యూనిట్ పేర్కొంది.
కానీ, ఆలస్యం ఒక్కరోజు లేదంటే, రెండు రోజులు మాత్రమే. సెప్టెంబర్ 15న రావాల్సిన ఈ వీడియో సాంగ్ ఇన్ని రోజులు కావస్తున్నా రిలీజ్ కాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. జస్ట్ సాంగ్ వీడియోకే పరిస్థితి ఇలా వుంటే, మరి సినిమా అయినా అనుకున్న టైమ్‌కి రిలీజ్ అవుతుందా.? లేదా.? అనే అనుమానాలు వస్తున్నాయి.
ఇలాంటి అనుమానాలే మెగాస్టార్ చిరంజీవిలోనూ వున్నాయట. ‘ఆచార్య’ సినిమా తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న సినిమా ఇది. దాంతో, చిరంజీవి కూడా ఒకింత టెన్షన్‌గానే వున్నారట. అసలే రీమేక్ సినిమా. ఓటీటీలో అందుబాటులో వున్న ఈ సినిమా ఒరిజినల్ని ఆల్రెడీ ఆడియన్స్ చాలా వరకూ చూసేశారు.
దాంతో సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడం బెటరా.? అనే ఆలోచనలోనూ చిరంజీవి వున్నారనీ అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం.
ఇదిలా వుంటే, మరోవైపు సల్మాన్ ఖాన్ తన సన్నివేశాల అవుట్ పుట్‌పై కూడా ఒకింత గుస్సా అవుతున్నారనీ తెలుస్తోంది. ‘గాడ్ ఫాదర్’పై ఎందుకిన్ని అనుమానాలు.? నిజంగా అనుమానాలేనా.? లేక దుష్ప్రచారమా.? తెలియాలంటే అక్టోబర్ 5 వరకూ ఆగాల్సిందే.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల