‘పవర్’ పంచ్‌: సమయం లేదు మిత్రమా.! సినిమానా.? రాజకీయమా.?

- September 20, 2022 , by Maagulf
‘పవర్’ పంచ్‌: సమయం లేదు మిత్రమా.! సినిమానా.? రాజకీయమా.?

ఓ వైపు సినిమా ఇంకో వైపు రాజకీయం.. ఇలా రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు ఓకే చేసి పెట్టేశారు. ఆల్రెడీ ఓ సినిమా ‘హరి హర వీరమల్లు’ సెట్స్‌పై వుంది. ఎప్పుడో కంప్లీట్ అయిపోవల్సిన ఈ సినిమా ఇండస్ర్టీలో అల్లుకున్న అననుకూల పరిస్థితుల కారణంగా ఆలస్యమవుతూ వస్తోంది.
ఇక, మరో రీమేక్ సినిమా ‘వినోదయ సితం’ కూడా సెట్స్ మీదికి తీసుకెళ్లాలి. కానీ, కుదరలేదు. అలాగే ‘భవదీయుడు భగత్ సింగ్’ స్క్రిప్ట్ చేతిలో పట్టుకుని, యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడు.
మరోవైపు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ జోరు పెంచాల్సిన సమయం వచ్చేసింది. ఎలక్షన్ మోడ్ ఆన్‌లోకి వచ్చేసింది. ఈ తరుణంలో జనంలో నిరంతరంగా తిరగాలి పవన్ కళ్యాణ్. వాస్తవానికి దశమి నాటికే తాను కమిట్ అయిన సినిమా ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి, ఫుల్ ఫోకస్ రాజకీయాలపై పెట్టాలని అనుకున్నాడు పవన్ కళ్యాణ్.
అందులో భాగంగానే ఆంధ్ర ప్రదేశ్‌లో బస్సు యాత్రకు సన్నాహాలు కూడా చేశారు. కానీ, పరిస్థితి చూస్తుంటే అందుకు అనుకూలంగా కనిపించడం లేదు. మరి, అనుకున్న టైమ్‌లోగా పవన్ కళ్యాణ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకుని రాజకీయ రధం ఎక్కుతారా.? చూడాలి మరి. ఫ్యాన్స్‌లో ఉత్సుకత, దానికి తోడు టెన్షన్ కూడా పెరిగిపోతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com