తప్పు తెలుసుకున్న రౌడీ.! ఆటిట్యూడ్‌కి గుడ్ బై చెప్పేశాడా.?
- September 20, 2022
ఆటిట్యూడ్‌కి పెట్టింది పేరు విజయ్ దేవరకొండ. నిజమే, సింగిల్ నైట్‌లో స్టార్ అయిపోయిన హీరో విజయ్ దేవరకొండ. ఎలాంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ర్టీలో నిలదొక్కుకోవడం అన్నది అంత ఆషా మాషీ విషయం కాదు.
అయితే, ఇలాంటి వ్యక్తులు ఇండస్ర్టీకి కొత్తేం కాదు. అది చూసుకుని విజయ్ దేవరకొండ చూపించిన జోరు అంతా ఇంతా కాదు. అసలే ఆటిట్యూడ్. ఆ పై విజయ్ చేసిన ఓవరాక్షన్ వుందే. మాటల్లో చెప్పలేం. ‘లైగర్’ సినిమాతో విజయ్ దేవరకొండకు గట్టి షాక్ ఇచ్చేశారు ఫ్యాన్స్, ఫ్యాన్స్‌తో పాటూ ఆడియన్స్.
ఈ షాక్‌లో విజయ్ దేవరకొండ చాలా మారిపోయాడు. తప్పు తెలుసుకున్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. ఆటిట్యూడ్ పూర్తిగా పక్కన పెట్టేశాడు. ‘ఆచార్య’లా మారిపోయి నీతి పాఠాలు చెప్పేస్తున్నాడు.
‘కష్టపడి పని చేయండి, మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి. టాలెంట్ పై ఫోకస్ పెట్టండి. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి. విజయాన్ని ఆస్వాదించండి. మీకు నచ్చినట్లుగా మీరు జీవించండి..’ అంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు విజయ్ దేవరకొండ.
ఈ పోస్ట్ చూశాకా, విజయ్ తప్పు తెలుసుకున్నాడన్న మాట. మార్పు మంచిదే.. అంటూ నెటిజన్లు రిప్లై పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ మార్పు వెనక పెద్ద స్కెచ్ లేకపోలేదు అంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
విజయ్ నటిస్తున్న ‘ఖుషి’ మూవీ త్వరలో రిలీజ్‌కి ముస్తాబవుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అయినా విజయ్‌కి విజయం అందించాలంటే ఈ మాత్రం తగ్గాల్సిందే మరి.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!