యుఎస్‌లో కోవిడ్-19 మహమ్మారి ముగిసింది: జో బైడెన్
- September 20, 2022
వాషింగ్టన్: అమెరికాలో కోవిడ్-19 మహమ్మారి దశ అంతమైనట్లు జో బైడెన్ అన్నారు. ఆ దేశంలో కోవిడ్ వల్ల మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నా.. అధ్యక్షుడు బైడెన్ మాత్రం ఈ ప్రకటన చేశారు. కొన్ని సమస్యలు ఉన్నా.. పరిస్థితి మాత్రం మెరుగవుతోందని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం ప్రతి రోజు అమెరికాలో కోవిడ్ వల్ల సగటున 400 మంది మరణిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కరోనా మహమ్మారి చివరి దశకు చేరుకున్నట్లు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఓఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బైడెన్ మాట్లాడుతూ.. వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం ప్రజలెవ్వరూ మస్క్‌లు ధరించడం లేదని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ మంచి స్థితిలో ఉన్నట్లు చెప్పారు. పరిస్థితి మారుతున్నట్లు ఆయన వెల్లడించారు. అమెరికాలో ఇప్పటి వరకు కరోనా వల్ల సుమారు 10 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







