ప్రవాస కార్మికులకు ఆన్ లైన్ ఈ సేవలను ప్రారంభించిన బహ్రెయిన్ హెల్త్ మినిస్ట్రీ
- September 21, 2022
బహ్రెయిన్ : బహ్రెయిన్ లోని ప్రవాస కార్మికులకు హెల్త్ మినిస్ట్రీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ప్రవాసులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు ఈ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు హెల్త్ మినిస్ట్రీ మెడికల్ కమీషన్స్ చీఫ్ డాక్టర్ ఐషా అహ్మద్ హుస్సేన్ తెలిపారు. నేషనల్ పోర్టల్ ద్వారా ప్రవాసులు వైద్య పరీక్షల కోసం స్లాట్ బుక్ చేసుకునే వీలు కల్పించారు. ఈ సేవల ద్వారా ప్రవాస కార్మికుల సమగ్ర హెల్త్ డేటా రికార్డు చేయవచ్చన్నారు. ఆన్ లైన్ లో డాక్టర్ అపాయింట్ మెంట్, ఫిట్ నెస్ టెస్ట్ ల అపాయింట్ మెంట్, హెల్త్ సర్టిఫికెట్ ను ప్రింట్ తీసుకోవచ్చు. కావాల్సిన హాస్పిటల్ ను ఎంచుకునే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్ అండ్ ఈ-గవర్నమెంట్ అథారిటీ (iGA), లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA), నేషనల్ అథారిటీ ఫర్ రెగ్యులేటింగ్ హెల్త్ ప్రొఫెషన్స్ అండ్ సర్వీసెస్ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో సేవలను అందిస్తాయని డాక్టర్ ఐషా అహ్మద్ హుస్సేన్ చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్‌లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్‌కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్‌పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









