సంక్షోభాల్లో ప్రపంచం కలిసికట్టుగా పనిచేయాలి - ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ
- September 21, 2022
న్యూయార్క్ : ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లు, సంక్షోభ సమయాల్లో ప్రపంచంలోని అన్ని దేశాలు మరింత కలిసి కట్టుగా పనిచేయాలని ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ అన్నారు. న్యూయార్క్ లో జరిగిన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 77వ సెషన్ జనరల్ డిబేట్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచం ఎదుర్కొంటోన్న చాలా సమస్యలను పరిష్కరించేందుకు ఐక్యరాజ్య సమితి చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ప్రస్తుతానికి ప్రపంచమంతా ఒక విలేజ్ గా మారిపోయిందన్నారు. ప్రతి సమస్య ఒక అంశంతో మరో అంశానికి ముడిపడి ఉందన్నారు. ప్రపంచమంతా ఓ కుగ్రామంగా మారి ఎంతో అభివృద్ధి జరుగుతున్నప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం ఆ వేగం అంతగా లేదన్నారు. పర్యావరణ సమస్యలు, ఆర్థిక సంక్షోభాలు, సైనిక ఘర్షణల సమస్యలను పరిష్కరించే విషయంలో మరింత కలిసికట్టుగా కృషి చేయాల్సి ఉందన్నారు. వన్ వరల్డ్, వన్ హ్యుమానిటీ అనే విధానానికి అనుగుణంగా కృషి జరగటం లేదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం దురాక్రమణాలకు పాల్పడుతూ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. బలమైన ప్రపంచం కోసం మనమంతా కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలను కోరారు. ఈ మీటింగ్ పలు దేశాల అధినేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







