డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ లో మందుల శాస్త్రీయ నామం రాయాల్సిందే- సౌదీ హెల్త్ మినిస్ట్రీ
- September 21, 2022
సౌదీ అరేబియా : డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ గురించి అందరికీ తెలిసిందే. ఆ రాత దేవుడికి కూడా అర్థం కాదు. పేషెంట్లకు అర్థమయ్యేలా మందుల చిట్టి ఉండాలని ఎన్నిసార్లు కోరిన వాళ్లు పట్టించుకోరు. ఆ సంగతి అలా ఉంచితే ఇక నుంచి డాక్టర్లు రాసే మందులకు సంబంధించి వాటి శాస్త్రీయ నామాన్ని రాయాల్సిందేనని సౌదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. డ్రగ్ కు సంబంధించిన సైంటిఫిక్ నేమ్ రాయమని కోరే హక్కు పేషెంట్ ఉందని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయం పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఓకే సైంటిఫిక్ ఫార్ములా తో కొన్ని వందల కంపెనీలు ఓకే డ్రగ్ ను తయారు చేసే విషయం తెలిసిందే. ఐతే డాక్టర్లు డ్రగ్ పేరు మాత్రమే రాయటంతో ఆ బ్రాండ్ మెడిసిన్ పేషెంట్లకు దొరకటం లేదు. అదే సైంటిఫిక్ నేమ్ తో మందుల చిట్టి ఉంటే ఆ శాస్త్రీయ నామానికి సంబంధించిన మెడిసిన్ ను వేరే బ్రాండ్ లో తీసుకునే అవకాశం ఉంటుంది. సెంటిఫిక్ నేమ్ రాసేందుకు ఎవరైనా డాక్టర్లు నిరాకరిస్తే 937 అనే నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం సూచించింది.
తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్‌లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్‌కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్‌పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









