ఈ నెల 25 నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం..
- September 22, 2022
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ సంబరాలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజులపాటు ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. ఎక్కడైనా దేవతల్ని పూలతో కొలుస్తారు. కానీ, పూలనే దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి బతుకమ్మలో ఉంది.
అమావాస్య రోజున మొదటి బతుకమ్మ అడతారు. ఈ సారి అమావాస్య సెప్టెంబర్ 25న వస్తుంది. దీన్ని పెత్తర అమావాస్య అని కూడా అంటారు. కేవలం తెలంగాణలోనే కాదు.. తెలంగాణ ప్రజలు ఉన్న ప్రతి చోటా ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. యూఏఈ,కువైట్,బహ్రెయిన్,ఖతార్,ఒమన్,సౌదీ అరేబియా, అమెరికా వంటి చోట్ల కూడా బతుకమ్మ ఆడుతారు. ప్రతి సంవత్సరం తెలంగాణ సమాజం ఘనంగా జరుపుకొనే వేడుకలు ఇవి. ప్రతి ఏటా భాద్రపద మాసంలో బహుళ అమావాస్య నుంచి అశ్వియుజ మాసం శుద్ధ అష్టమి వరకు బతుకమ్మ సంబరాలు జరుగుతాయి. ఎంగిలిపూలతో మొదలై, సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి. తొమ్మిది రోజులూ తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను పేరుస్తారు. సిబ్బి లేదా పళ్లెంలోగాని, తాంబూలంలోగాని అడుగున ఆకులు పరిచి, తంగేడు పూలు, గునును పూలు, బంతి పూలు.. ఇలా ఈ సీజన్‌లో దొరికే పూలతో బతుకమ్మను పేరస్తారు.
బతుకమ్మ మధ్యలో గౌరమ్మను అలంకరించి, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి, తమ ముత్తయిదువ తనాన్ని నిలిపే గౌరమ్మను భక్తిగా పూజిస్తారు. మన సంప్రదాయంలో రకరకాల పూలతో దేవతల్ని పూజిస్తాం. కానీ, పూలనే దేవతా మూర్తిగా భావించి కొలిచే సంప్రదాయమే బతుకమ్మ. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఆడవాళ్లంతా ఒక చోట చేరి, బతుకమ్మ చుట్టూ నిలిచి చప్పట్లు కొడుతూ, కోలలు వేస్తూ, పాటలు పాడుతూ, ఉత్సాహంగా బతుకమ్మ వేడు జరుపుకొంటారు. బతకుమ్మ నేపథ్యం గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నా… ఇది అచ్చమెన తెలంగాణ సంస్కృతి. తెలుగువారి సంప్రదాయం కూడా. అందులోనూ మన ఆడ పడుచుల వేడుక ఇది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







