లైసెన్స్ లేకుండా డ్రైవింగ్.. Dh16,000 జరిమానా విధించిన కోర్టు

- September 22, 2022 , by Maagulf
లైసెన్స్ లేకుండా డ్రైవింగ్.. Dh16,000 జరిమానా విధించిన కోర్టు

యూఏఈ: లైసెన్స్ లేకుండా.. ఓనర్ అనుమతి తీసుకోకుండా కారును తీసికెళ్లి యాక్సిడెంట్ చేసిన ఓ మహిళకు ఆల్ ఐన్ సివిల్ అప్పీల్ కోర్టు భారీ జరిమానా విధించింది. కారుకు జరిగిన నష్టాన్ని పూర్తిగా భరించాలని, కారు ఓనరుకు Dh16,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. తన కారును తీసికెళ్లిన మహిళ యాక్సిడెంట్ చేసిందని, దీంతో తన కారు పూర్తిగా డ్యామేజ్ అయిందని దానికి ప్రతిపలంగా తనకు Dh18000 చెల్లించేలా ఆదేశించాలని మహిళపై  కారు ఓనర్ కోర్టులో దావా వేశాడు. లైసెన్స్ లేకుండా మహిళ డ్రైవింగ్ చేయడంతోనే కారు ప్రమాదానికి గురైందని , అది ప్రయాణానికి పనికిరాదని అధికారులు కోర్టుకు నివేదిక అందజేశారు. అన్ని పక్షాలు సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించి.. మహిళను ట్రాఫిక్ కోర్టు దోషిగా నిర్ధారించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com