ఫిఫా ప్రపంచ కప్ 2022.. సందర్శకుల ప్రవేశంపై ఖతార్ ఆంక్షలు
- September 22, 2022
ఖతార్: ఫిఫా ప్రపంచ కప్ 2022 నేపథ్యంలో సందర్శకుల ప్రవేశంపై ఖతార్ ఆంక్షలు విధించింది. 2022 నవంబర్ 1 నుండి సందర్శకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిషేధ ఆంక్షలు 2022 డిసెంబర్ 23 వరకు అమల్లో ఉంటాయని సెక్యూరిటీ కమిటీ హెడ్ అబ్దుల్లా ఖలీఫా అల్-ముఫ్తా తెలిపారు. కాగా, హయ్యా కార్డ్ హోల్డర్లు మాత్రం స్వేచ్ఛగా దేశంలోకి ప్రవేశించడంతోపాటు వారు 2023 జనవరి 23 వరకు దేశంలో ఉండవచ్చని టోర్నమెంట్ సెక్యూరిటీ ఆపరేషన్స్ కమాండర్ కార్యాలయం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కల్నల్ జాసిమ్ అల్ సయ్యద్ తెలిపారు. అలాగే ఖతారీ పౌరులు, నివాసితులు, ఖతారీ ID కార్డ్ కలిగి ఉన్న GCC పౌరులు, వ్యక్తిగత వీసాలు, వర్క్ ఎంట్రీ పర్మిట్‌లను కలిగి ఉన్నవారు, అలాగే ఆమోదించబడిన మానవతా కేసుల వారికి కొత్త నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాబోయే ప్రపంచ కప్ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు జారీ చేసిన చట్టాలు, నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







