జింఖానా గ్రౌండ్స్ తొక్కిసలాటలో ఎవరు చనిపోలేదు: హైదరాబాద్ పోలీస్
- September 22, 2022
హైదరాబాద్: జింఖానా గ్రౌండ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న భారత్-ఆసీస్ మధ్య మూడో టీ20 మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్‌కు క్రికెట్ అభిమానులు భారీగా తరలిరావడం తో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఓ మహిళా చనిపోయిందనే వార్తలు బయటకు రావడంతో పోలీసులు స్పందించారు. తొక్కిసలాటలో ఎవరు చనిపోలేదని క్లారిటీ ఇచ్చారు.
ఈనెల 25న ఉప్పల్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఏర్పాట్లు చేసిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జింఖానా మైదానంలో టికెట్లు విక్రయిస్తున్నారు. మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు జింఖానా గ్రౌండ్ కు పోటెత్తారు. వేలాదిగా తరలి వచ్చిన క్రికెట్ అభిమానులను నియంత్రించే క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేయడం తో స్వల్ప తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు క్రికెట్ అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడడంతో ..యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అభిమానులకు, పోలీసులకు జరిగిన ఘర్షణలో పలువులు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్‌ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









