క్రౌన్ ప్రిన్స్ షేక్ సల్మాన్‌తో భారత రాయబారి శ్రీవాస్తవ భేటీ

- September 22, 2022 , by Maagulf
క్రౌన్ ప్రిన్స్ షేక్ సల్మాన్‌తో భారత రాయబారి శ్రీవాస్తవ భేటీ

మనామా: క్రౌన్ ప్రిన్స్ కోర్ట్ ప్రెసిడెంట్, షేక్ సల్మాన్ బిన్ అహ్మద్ బిన్ సల్మాన్ అల్ ఖలీఫాతో బహ్రెయిన్ లోని రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాయబారి పీయూష్ శ్రీవాస్తవ మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భారత రాయబారి శ్రీవాస్తవకు క్రౌన్ ప్రిన్స్ కోర్ట్ షేక్ సల్మాన్ స్వయంగా స్వాగతం పలికారు. బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్న చారిత్రక బంధంపై ఇరువురు చర్చించారు. బహ్రెయిన్ మరింత పురోగతి, అభివృద్ధిని కాంక్షిస్తూ క్రౌన్ ప్రిన్స్ కోర్ట్ ప్రెసిడెంట్‌కి భారత రాయబారి తన అభినందనలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com