‘గాడ్ ఫాదర్’ కోసం రెడీ అవుతోన్న అదిరిపోయే ‘ఐటెం’.!

- September 22, 2022 , by Maagulf
‘గాడ్ ఫాదర్’ కోసం రెడీ అవుతోన్న అదిరిపోయే ‘ఐటెం’.!

మలయాళ మూవీ ‘లూసిఫర్‌కి రీమేక్‌గా రూపొందుతోన్న ‘గాడ్ ఫాదర్’ మూవీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా టైమ్ దగ్గర పడుతున్నందున ప్రమోషన్స్ షురూ చేసింది చిత్ర యూనిట్.
అందులో భాగంగా రిలీజైన ‘తార్ మార్ టక్కర్ మార్..’ అనే సాంగ్ వీడియో ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇక, ఇదే ఊపు కంటిన్యూ చేసేలా వరుస అప్డేట్స్ రానున్నాయట. 
‘లూసిఫర్’ ఓ సిరీయస్ పొలిటికల్ డ్రామా. ఇందులో ఎలాంటి కమర్షియల్ అంశాలకీ అవకాశం లేదు. కానీ, తెలుగు వెర్షన్‌కి వచ్చేసరికి చిరంజీవి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని, తెలుగు ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లుగా కొన్ని కీలకమైన మార్పులు చేశారట. 
ఈ సినిమాకి అడిషనల్‌గా యాడ్ చేసిన సాంగ్స్ ఆ కోవకు చెందినవే. ఆల్రెడీ ఓ సాంగ్ రిలీజ్ చేశారు. మరో మూడు పాటలున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి ఐటెం సాంగ్ అట. అయితే, ఈ ఐటెం సాంగ్‌లో ఐటెం గాళ్‌తో కలిసి చిరంజీవి స్టెప్పులేయరట కానీ, కొన్ని సిగ్నేచర్ స్టెప్పులతో ఈ సాంగ్‌ని డిఫరెంట్‌గా తెరకెక్కించనున్నారట. 
మరోవైపు, ఎంత మార్పులు చేస్తే మాత్రం ఆల్రెడీ ఆ సినిమా మలయాళ వెర్షన్ తెలుగులో చూసేసిన ఆడియన్స్ ఈ సినిమాలో పాటలకు అవకాశమే లేదు. ఆల్రెడీ రిలీజ్ చేసిన ‘తార్ మార్ టక్కర్ మార్’ పాటనే ఎక్కడ ఇరికించనున్నారా.? అని ఆలోచిస్తున్నారట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com