మాస్ రాజా ఈ ఏడాది ‘ధమాకా’ చూపిస్తాడా.?
- September 22, 2022
మాస్ రాజా రవితేజ నుంచి వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయ్ ఈ మధ్య. ఇక తదుపరి సినిమాతో తన ‘ధమాకా’ చూపిస్తానంటున్నాడు రవితేజ.
అదేనండీ, రవితేజ తదుపరి చిత్రం ‘ధమాకా’. నక్కిన త్రినాధరావు ఈ సినిమాకి దర్శకుడు. ‘పెళ్లి సందడి’ ఫేమ్ శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంతవరకూ రిలీజ్ చేసిన ఈ సినిమా ప్రోమోలు సో సో గా వున్నాయనే చెప్పాలి. అయితే, ఈ సినిమాతో మాస్ రాజా ఈజ్ బ్యాక్ అంటూ ఆయన ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు లేటెస్టుగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుందట. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే, ఈ ఏడాది వచ్చిన రవితేజ సినిమాలన్నీ ఢమాల్ అవ్వడంతో, ఈ సినిమా రిలీజ్ పట్ల మేకర్లు కొంత అసంతృప్తితో వున్నారట.
ఈ సినిమాతో పాటూ, రవితేజ చేతిలో మరో రెండు సినిమాలున్నాయ్. అవే ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘రావణాసుర’ చిత్రాలు. ఈ సినిమాలను కూడా సమాంతరంగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు మాస్ రాజా రవితేజ.
ఈ రెండు సినిమాల్నీ వచ్చే ఏఢాది రేస్‌లో వుంచి, ‘ధమాకా’ని ఈ ఏడాదిలోనే రేస్‌లోకి దించాలన్న ఆలోచన జరుగుతోందట. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే, మాస్ రాజా ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటారు చూడాలి మరి, ఏం జరుగుతుందో.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







