ఎట్టకేలకు ‘ఇండియన్ 2’ సెట్ల్లోకి అడుగు పెట్టిన కమల్ హాసన్.!
- September 22, 2022
ఆగిపోయిందనుకున్న ‘భారతీయుడు 2’ సినిమాని ఎట్టకేలకు పట్టాలెక్కించారు లోక నాయకుడు కమల్ హాసన్. కరోనాకి ముందే సెట్లో జరిగిన క్రెయిన్ యాక్సిడెంట్ కారణంగా ఈ సినిమాని అర్ధాంతరంగా నిలిపేశారు. ఆ తర్వాత డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమాని లాంచ్ ఛేశాడు. కామ్‌గా షూటింగ్ కూడా కానిచ్చేస్తున్నాడు.
ఇటీవల ‘విక్రమ్’ సినిమాతో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఫామ్‌లోకి వచ్చిన విశ్వనటుడు కమల్ హాసన్, అప్పటికప్పుడు శంకర్‌ని ఒప్పించి ఈ సినిమాని తిరిగి సెట్స్ మీదికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. ఫ్రయత్నాలు ఫలించడంతో సడెన్‌గా ‘ఇండియన్ 2’ పట్టాలెక్కేసింది.
సమాంతరంగా అటు చరణ్ సినిమానీ, ఇటు కమల్ సినిమానీ పూర్తి చేస్తానని శంకర్ ప్రకటించారనుకోండి. ఆ సంగతి పక్కన పెడితే, తాజాగా ‘ఇండియన్ 2’ సెట్స్‌లో కమల్ హాసన్ సందడి షురూ చేశారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆల్రెడీ కొంతమేర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి, విడుదల చేయాలని కమల్ అండ్ టీమ్ యోచిస్తోందట.
ఈ సినిమా తిరిగి ప్రారంభం కావడంతో హీరోయిన్లు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ పట్టరాని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







