‘లైగర్’ మళ్లీ వచ్చాడోచ్.! బూతులు మళ్లీ మొదలయ్యాయోచ్.!
- September 22, 2022
ఇంతన్నాడంతన్నాడోయ్ గంగరాజు.. ముంత మామిడి పండన్నాడోయ్ గంగరాజు.. అన్నట్లుగా ‘లైగర్’ సినిమా విషయంలో జరిగిన ప్రీ రిలీజ్ హడావిడి అంతా ఇంతా కాదు, తీరా సినిమా రిలీజ్ అయ్యాకా తుస్ మనిపించారు. సినిమాని దారుణంగా తిట్టి పోశారు ఆడియన్స్.
అసలిలాంటి సినిమాలో రౌడీ ఎందుకు నటించాడ్రా బాబూ.! అని ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టారంటే అతిశయోక్తి కాదేమో. అలా ‘లైగర్’ చరిత్ర ముగిసిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ ముచ్చట మర్చిపోతున్నారనుకున్న టైమ్‌లో ‘లైగర్’ని ఓటీటీ వేదికగా మళ్లీ రిలీజ్ చేశారు.
ఇక అంతే.! తిట్లు మళ్లీ షురూ అయ్యాయ్. ధియేటర్లో చూడని ఆ మిగిలిన ఆడియన్స్ ఇప్పుడు ఓటీటీలో సినిమా చూసి తలలు పట్టుకుంటున్నారు. పూరీ జగన్నాధ్‌ని ఓ రేంజ్లో ఆడిపోసుకుంటున్నారు. పాపం.! విజయ్ దేవరకొండ. ఈ పాటి సినిమా కోసం ఒళ్లు హూనం చేసుకున్నాడు. కండలు కరిగించాడు. ఓ కథా, కాకరకాయ్, రీజన్బుల్, అండ్ స్ర్టాంగ్ టార్గెట్ లేని ఫైటర్ స్టోరీని ‘లైగర్’ సాలా క్రాస్ బ్రీడ్ అంటూ టైటిల్ పెట్టేసి, తెగ బిల్డప్ ఇచ్చేసి జనాల మీద వదిలేశాడు.. అంటూ పూరీని జనం మళ్లీ ఆడిపోసుకోవడం మొదలెట్టేశారు.
‘లైగర్’ పేరు చెప్పి, విజయ్ దేవరకొండ జీవితంతో ఆడుకున్నాడు పూరీ జగన్నాధ్.. అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు.
తాజా వార్తలు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!







