బహ్రెయిన్‌లో కొత్త విజిట్ వీసా నిబంధనల అమలు వేగవంతం

- September 23, 2022 , by Maagulf
బహ్రెయిన్‌లో కొత్త విజిట్ వీసా నిబంధనల అమలు వేగవంతం

బహ్రెయిన్: మానవ అక్రమ రవాణా, విదేశీయుల అక్రమ ప్రవేశాన్ని నిరోధించే ప్రయత్నాలలో భాగంగా తీసుకొచ్చిన కొత్త విజిట్ వీసా నిబంధనల అమలును విమానాశ్రయ అధికారులు వేగవంతం చేశారు. విజిట్ వీసాపై బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల్లో నిబంధనలను పాటించని వారిని అధికారులు బలవంతంగా స్వదేశానికి తిరిగి పంపుతున్నారు. గల్ఫ్ ఎయిర్ ఇంతకుముందు కొత్త నిబంధనలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. దీని ప్రకారం.. విజిట్ వీసా హోల్డర్లు తప్పనిసరిగా ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన క్రెడిట్ కార్డ్‌ని కలిగి ఉండాలి. లేదా అతను/ఆమె రాజ్యంలో ఉండటానికి రోజుకు BD50 ఖర్చు చేసే సామర్థ్యం కలిగి ఉండాలి. BD300 కనీస ఖాతా బ్యాలెన్స్‌తో బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను సమర్పించడం ద్వారా ఆన్‌లైన్‌లో విజిట్ వీసాను పొందవచ్చని అధికారులు తెలిపారు. సందర్శకుడు రిటర్న్ టిక్కెట్‌లతో పాటు హోటల్ బుకింగ్ పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుందన్నారు. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో సహా ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలలో చాలా మంది మోసపూరిత ఏజెంట్లు ఉన్నారని, వారు అమాయక, చదువుకోని క్లయింట్‌లను మోసం చేసేందుకు ఉద్యోగ వీసాను పేరుతో వారిని పంపుతున్నారని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు. మోసగాళ్ల బారిన పడిన తర్వాత ఇంటికి తిరిగి రావడం లేదా అక్రమ నివాసిగా రాజ్యంలో తమ బసను కొనసాగించడం తప్ప బాధితులకు వేరే మార్గం ఉండటం లేదని, బాధితుల్లో ఎక్కువ మంది నైపుణ్యం లేని కార్మికులే ఉంటున్నారని సామాజిక కార్యకర్తలు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com