సెప్టెంబర్ 25 వరకు ఒనైజా స్ట్రీట్ తాత్కాలికంగా మూసివేత
- September 23, 2022దోహా: అల్ ఇంతేసర్ స్ట్రీట్, అల్ షామ్ స్ట్రీట్ మధ్య ఉన్న ఒనైజా స్ట్రీట్ లేన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ప్రకటించింది. మౌలిక సదుపాయాల కల్పన, రహదారి పనుల నిర్వహణ నేపథ్యంలో మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అష్ఘల్ తెలిపింది. ఈరోజు సాయంత్రం 10 గంటల నుంచి సెప్టెంబర్ 25 తెల్లవారుఝామున 3 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఒనైజా ఇంటర్సెక్షన్ నుండి అల్-ఇంటిసార్ స్ట్రీట్కు వెళ్లే వారి కోసం ఒనైజా స్ట్రీట్లో వాహనాల కోసం రెండు లేన్లు అందుబాటులో ఉన్నాయని అష్ఘల్ తన ట్విట్టర్ హ్యాండిల్లో తెలిపింది. వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి అల్ మార్కియా స్ట్రీట్ లేదా చుట్టుపక్కల అంతర్గత రోడ్లలో వెళ్లాలని అష్ఘల్ సూచించింది.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం