సెప్టెంబర్ 25 వరకు ఒనైజా స్ట్రీట్ తాత్కాలికంగా మూసివేత
- September 23, 2022
దోహా: అల్ ఇంతేసర్ స్ట్రీట్, అల్ షామ్ స్ట్రీట్ మధ్య ఉన్న ఒనైజా స్ట్రీట్ లేన్‌లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ప్రకటించింది. మౌలిక సదుపాయాల కల్పన, రహదారి పనుల నిర్వహణ నేపథ్యంలో మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అష్ఘల్ తెలిపింది. ఈరోజు సాయంత్రం 10 గంటల నుంచి సెప్టెంబర్ 25 తెల్లవారుఝామున 3 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఒనైజా ఇంటర్‌సెక్షన్ నుండి అల్-ఇంటిసార్ స్ట్రీట్‌కు వెళ్లే వారి కోసం ఒనైజా స్ట్రీట్‌లో వాహనాల కోసం రెండు లేన్‌లు అందుబాటులో ఉన్నాయని అష్ఘల్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో తెలిపింది. వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి అల్ మార్కియా స్ట్రీట్ లేదా చుట్టుపక్కల అంతర్గత రోడ్లలో వెళ్లాలని అష్ఘల్ సూచించింది.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







