సీనియర్ జర్నలిస్టు అంకబాబు అరెస్ట్

- September 23, 2022 , by Maagulf
సీనియర్ జర్నలిస్టు అంకబాబు అరెస్ట్

విజయవాడ:  సీనియర్ జర్నలిస్టు అంకబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.గురువారం (సెప్టెంబర్ 21,2022) రాత్రి 73 ఏళ్ల సీనియర్ జర్నలిస్టు కొల్లు అంకబాబును విజయవాడలోని ఆయన నివాసంలోనే సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వాట్సాప్ లో ఓ మెసేజ్ ఫార్వడ్ చేసినందుకు అంకబాబును అధికారులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దినపత్రికల్లో జన్నలిస్టుగా సుదీర్ఖకాలం పనిచేసిన అంకబాబును ఆయన నివాసంలోనే బలవంతంగా అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు గుంటూరులోని కార్యాలయానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. అంకబాబును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు ఆయన భార్యకు నోటీసులు జారీ చేశారు. అంకబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్స్ వస్తున్నాయి. మాజీ సీఎం..టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు నేతలు..జర్నలిస్టులు అంకబాబును విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

గన్నవరం ఎయిర్ పోర్టును దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకురాలని నుంచి బంగారాన్ని స్వాధీనపరుకున్నారనే వార్తను వాట్సాప్ లో అంకబాబు ఫార్వాడ్ చేసినందుకు సీఐడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. కాగా సదరు బంగారం తీసుకొచ్చిన మహిళ ఓ ఐఏఎస్ అధికారి భార్య అన్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ అంకబాబు అరెస్ట్ కు సంబంధించి పోలీసులను పలువురు ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేకపోయారు. అంకబాబు తన మొబైల్‌కి ఎవరో పంపిన వార్తను ఫార్వార్డ్ చేయగా ఆయన వేరేవారికి ఫార్వాడ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈక్రమంలో ఆయన ఆ మెసేజ్ ఫార్వాడ్ చేసిందనుకు సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.

73 ఏళ్ల వ్యక్తిని రాత్రి సమయంలో అరెస్టు చేయడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని ఆయన తరపు న్యాయవాది శ్రీధర్ తోట అన్నారు. నారా చంద్రబాబు అంకబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ..సీనియర్ జర్నలిస్టును విడుదల చేయాలని డీజీపీకి లేఖ రాశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఒక సీనియర్‌ రచయితను నాసిరకం కారణాలతో అరెస్ట్‌ చేసిందని విమర్శించారు. కనీసం ఆరోగ్య కారణాలతోనైనా అంకబాబును విడుదల చేయాలని వర్కింగ్ జర్నలిస్టు సంఘం విజ్ఞప్తి చేసింది. సీనియర్ జర్నలిస్టు అంకబాబు మధుమేహంతో బాధపడుతున్నారని..ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపింది.

కాగా అంకబాబు కుమారుడు రంజిత్‌ బోస్టన్‌లో, కుమార్తె అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో నివసిస్తున్నారు. విజయవాడలో ఆయన భార్యతో కలిసి నివసిస్తున్నారు. పలు పత్రికలతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా కొంతకాలం పనిచేసిన అంకబాబు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా పాత్రికేయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com