సౌదీ జాతీయ దినోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసిన బహ్రెయిన్
- September 23, 2022బహ్రెయిన్: సౌదీ అరేబియా ఇవ్వాళ జాతీయ దినోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఐతే సౌదీ జాతీయ దినోత్సవాన్ని బహ్రెయిన్ కూడా ఘనంగా నిర్వహించటం విశేషం. సౌదీతో ఉన్న స్నేహ సంబంధాలకు గుర్తుగా ఆ దేశ జాతీయ దినోత్సవాన్ని బహ్రెయిన్ ఘనంగా సెలబ్రేట్ చేసింది. బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్ అథారిటీ (BTEA) ఆధ్వర్యంలో మనామా లోని సౌక్‌లో ఈ కార్యక్రమం జరిగింది. “డిలైట్ టూ సీ యూ” అనే థీమ్ తో సౌదీ జాతీయ దినోత్సవం సందర్భంగా పలు ఈవెంట్స్ ను బహ్రెయిన్ చేపట్టింది. "బహ్రెయిన్ -సౌదీ అరేబియా ల మధ్య ఉన్న సన్నిహిత చారిత్రిక సంబంధాలకు గుర్తుగా సౌదీ జాతీయ దినోత్సవ వేడుకలను మనామా సౌక్ వేదికగా నిర్వహించాం. రెండు దేశాల మధ్య వ్యాపార, చారిత్రాక సంబంధాలకు గుర్తుగా ఈ కార్యక్రమం చేపట్టాం” అని BTEA CEO డాక్టర్ నాజర్ ఖైదీ అన్నారు. వేడుకల్లో భాగంగా బహ్రెయిన్ ఫోక్ బ్యాండ్, సౌదీ, బహ్రెయిన్ వారసత్వానికి సంబంధించి పాటలను ప్రదర్శించారు. అటు సౌక్ లో పది రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం