సౌదీ జాతీయ దినోత్సవం సందర్భంగా 'అల్ ఐన్ జూ' కు ఫ్రీ ఎంట్రీ
- September 23, 2022
అల్ ఐన్: సౌదీకి జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది యూఏఈ. ఆ దేశంతో ఉన్న సత్సంబంధాల కారణంగా సౌదీ జాతీయ దినోత్సవాన్ని యూఏఈ ఘనంగా సెలబ్రేట్ చేస్తోంది. ఇందులో భాగంగా అబుదాబిలో ప్రసిద్ధ “అల్ ఐన్ జూ” లో సందర్శకులను ఉచితంగా అనుమతిస్తున్నారు. 23, 24 తేదీల్లో ఈ జూ లో సందర్శకులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు జూ అధికారులు తెలిపారు. జంతువులకు ఆహారం అందించేందుకు ఎన్ క్లోజర్స్ దగ్గరి వరకు వెళ్లేందుకు అనుమతించున్నారు. అదే విధంగా అల్ ఐన్ లోని సఫారీ ప్రయాణాలపై 50 శాతం తగ్గింపు ప్రకటించారు. " సౌదీ నేషనల్ డే ను పురస్కరించుకొని “అల్ ఐన్ జూ” సందర్శకుల ఫ్రీ ఎంట్రీ కల్పించాం. అదే విధంగా పలు రైడ్స్ పై పలు ఆఫర్లు ప్రకటించాం. వీటిని సందర్శకులు పూర్తిగా ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. జూ లో గడిపే సమయాన్ని సందర్శకులు ఎంజాయ్ చేయాలన్నదే మా ఉద్దేశం" అని జూ డైరెక్టర్ జనరల్ ఘనిమ్ ముబారక్ అల్ హజేరి చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







