యువకున్ని హత్య చేసిన మిలిటరీ వ్యక్తికి మరణ శిక్ష
- September 23, 2022
కువైట్: యువకున్ని హత్య చేసిన ఘటనలో మిలటరీలో పనిచేసిన వ్యక్తికి కువైట్ మిలటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. జులాయి ఏడారిలో ఉన్న ఓ యువకున్ని మిలటరీలో పనిచేస్తున్న వ్యక్తి గొంతు నులిమి చంపాడు. విచారణలో అతను దోషిగా తేలాడు. దీంతో కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. కువైట్ లో ఈ ఏడాదిలో ఇదే మొదటి హత్య కేసుగా నమోదైంది. దోషిగా తేలిన వ్యక్తికి గతంలోనూ నేర చరిత్ర ఉంది. హత్యకు కొన్ని వారాల ముందే అతను జైలు నుంచి విడుదలయ్యాడు. వేరే కేసులో అతనికి 15 ఏళ్ల జైలు శిక్ష వేశారు. ఐతే 10 ఏళ్లు శిక్ష అనుభవించిన తర్వాత క్షమాభిక్ష పెట్టటంతో ఇటీవలే విడుదలయ్యాడు. వచ్చిన కొన్ని రోజులకే యువకున్నిహత్య చేశాడు. తానే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకోవటంతో విచారణ వేగంగా పూర్తైంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







