ఖతార్లో బస్సులన్నిటికి ఏ.సి. సదుపాయం
- June 16, 2015
11 లేదా అంతకంటే ఎక్కువమంది ప్రయాణీకులను కలిగియున్న అన్ని వాహనాలూ, ఈ సంవత్సరం జులై 1 నుండి తప్పనిసరిగా ఏర్ కండీషనింగ్ను కలిగిఉండాలని ఖతార్ అంతర్గత (INTERIOR) మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా ఇన్సులేటెడ్ కిటికీలు, బంపరు మీద రిఫ్లెక్టివ్ స్టికర్లు, 50 మంది కంటే ఎక్కువ కపాసిటీ కలిగిన వాహనాల వెనుకభాగంలో పైవైపున బ్లింకింగ్ లైట్లను తప్పనిసరి చేసింది.
ఇంకా, కొత్త భద్రతా నియమావాళిలో భాగంగా, పాడచరులు, సైక్లిస్టులు భారీవాహనాల చక్రాల కిందపడి నలిగిపోవడాన్ని నిరోధించడానికి, సేఫ్టీబార్ను కలిగిఉంటే తప్ప, మిగిలిన అన్నిటి కింది భాగం నేల ఉపరితలంనుండి 55cmలోపే ఉండేలా నిబంధన విధించింది.
చూడబోతే, వేసవిలో, ఖతార్ మందుటెండల్లో స్వంతవాహనాలు లేక, నివాసం నుండి పనిచేసేచోటుకి కిక్కిరిసిన వాహనాలలో ఊపిరిపీల్చి వదలడానికి కూడా వీలులేని విధమైన వాహనాల్లో ప్రయాణించే సగటు ఉద్యోగులు ఇకపై కాస్త చల్లగా ఉపిరి పీల్చుకోగలరని ఆశిద్దాం!
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







