పగటి వేళ బహిరంగ భోజన-పానీయ సేవనం నిషిద్ధం

- June 16, 2015 , by Maagulf
పగటి వేళ బహిరంగ భోజన-పానీయ సేవనం నిషిద్ధం

ఒమాన్ శిక్షాస్మృతి ప్రకారం, అతి పవిత్రమైన రమదాన్ మాసంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు పగలు భోజనం, పానీయసేవనం పూర్తిగా నిషిద్ధమని, అలా బహిరంగంగా భోజనం, తాగడం చేసేవారికి10 రోజుల జైలుశిక్ష లేదా జరిమానా విధించబడుతుందని రాయల్ ఒమాన్ పోలీస్ అధికారులు హెచ్చరించారు. సూఫ్యాన్ ఖలీఫా, సర్వశక్తివంతుడైన అల్లాకు ఒడంబడి, బహిరంగ ప్రదేశాలలో భుజింపవద్దని  అందరికీ పిలుపునిచ్చారు. 

మస్కట్ మ్యూనిసిప్యాలిటీ అధికారి ఒకరు, రమదాన్ సందర్భంగా అన్ని రెస్టారెంట్లు, కేఫ్లు మూసివేయాలని, భోజనానికి రెస్టారెంట్లపై ఆధారపడే ముస్లిమేతర కార్మికుల కోసం, కొన్ని రెస్టారెంట్లకు అనుమతినిచ్చామని, ఐతే అవి వారి పనిప్రదేశాలకే భోజనాన్ని పంపించాలని, వారు బయట ప్రదేశాలలో కాక, లోపలనే భుజించాలని ఆయన వివరించారు. ఉదయం 8 గం. నుండి అర్థరాత్రి వరకు, ఆహార పర్యవేక్షణా దళాలను నియోగించామని కూడా ఆయన తెలిపారు.
    ఇండియన్ సోషల్ క్లబ్ చైర్మన్ - Dr. సతీష్ నంబియార్, తాను గత 18 సాంవత్సరాలుగా రమదాన్ ఉపవాశాలను పాటిస్తున్నానని, మధ్యలో ఆరోగ్యకారణాల వలన అంతరాయం కలిగినప్పటికీ, స్థానిక ముస్లిం సోదరులకు ఐక్యతా సూచకంగా మరల కొనసాగిస్తున్నానని తెలిపారు.

 

--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com