వరల్డ్ టాప్ వన్ గా ఎయిర్ వేస్ గా నిలిచిన ఖతార్ ఎయిర్ వేస్
- September 24, 2022
ఖతార్ : ఖతార్ ఎయిర్ వేస్ వరల్డ్ బెస్ట్ ఎయిర్ లైన్స్ గా నిలిచింది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్ వేస్ గా 2022 సంవత్సరానికి గుర్తింపు పొందింది. స్కై ట్రాక్స్ సంస్థ ప్రకటించిన ర్యాంకులలో ఈ ఏడాది సింగపూర్ ఎయిర్ లైన్స్ ను వెనక్కి నెట్టి ఖతార్ ఫస్ట్ ప్లేస్ దక్కించుకోవటం విశేషం. విమాన సంస్థలకు స్కై ట్రాక్స్ సంస్థ ఇచ్చే అవార్డులు అస్కార్ తో సమానం. ఈ సంస్థ అవార్డు దక్కించుకోవటానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఎయిర్ లైన్స్ సంస్థలు పోటీ పడతాయి. కరోనా కారణంగా 2020 లో ఈ అవార్డులను ప్రకటించలేదు. ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొని ప్రయాణికుల సంఖ్య పెరగటంతో ఈ ఏడాది అవార్డులు ప్రకటించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు స్కై ట్రాక్ ఓటింగ్ నిర్వహించింది. ప్రయాణం, సిబ్బంది వ్యవహరించే తీరు, సౌకర్యాలు ఇలా అన్ని విభాగాల్లో కలుపుకొని సర్వే నిర్వహించారు. మొత్తం 350 ఎయిర్ లైన్స్ కు సంబంధించిన సర్వే నిర్వహించగా ఇందులో ఖతార్ ఎయిర్ లైన్స్ నంబర్ వన్ గా నిలిచింది. అటు ఇతిహాద్ ఎయిర్ లైన్స్ టాప్ 20 ఎయిర్ లైన్స్ లో 12 స్థానం దక్కించుకుంది. వరల్డ్ టాప్ ఎయిర్ వేస్ గా నిలవటం పై ఖతార్ ఎయిర్ లైన్స్ సంతోషం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







