బాంబు దాడి కేసులో నిర్దోషిగా తేలిన వ్యక్తి...తనను సోషల్ మీడియాలో తిట్టిన వారిపై దావా

- September 24, 2022 , by Maagulf
బాంబు దాడి కేసులో నిర్దోషిగా తేలిన వ్యక్తి...తనను సోషల్ మీడియాలో తిట్టిన వారిపై దావా

కువైట్: ఆత్మాహుతి దాడి కేసులో నిర్దోషిగా తేలిన ఓ వ్యక్తి...తనను నిందితుడంటూ సోషల్ మీడియాలో తిట్టిన వారందరినీ కోర్టుకు లాగాడు. తనకు ఆ బాంబు దాడితో ఎలాంటి సంబంధం లేకపోయిన దాదాపు 4 వేల మంది ట్విట్టర్ లో తనను అసభ్యంగా తిట్టారంటూ వారందరిపై దావా వేశాడు. వివరాల్లోకి వెళితే 2015 లో కువైట్‌లోని షియా మసీదుపై ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జరిపిన ఈ దాడిలో 27 మంది చనిపోయారు. ఐతే టెర్రరిస్టులు వాడిన కారు యాజమాని అంటూ పోలీసులు ఓ వ్యక్తి అరెస్ట్ చేశారు. అతనిపై కేసు నమోదు చేయటంతో కోర్టు లో విచారణ జరిగింది. ఉగ్రదాడికి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి కి ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని తేల్చిన కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. కానీ చాలా మంది ట్విట్టర్ లో అతన్ని తిడుతూ కామెంట్లు చేశారు. దీంతో ఆ వ్యక్తి ట్విట్టర్ లో తిట్టిన 4 వేల మందిపై దావా వేశారు. వాళ్లందరినీ గ్రూపులు, గ్రూపులుగా విచారించాలని కోర్టును కోరాడు. వారి ఫోన్ నంబర్లను కూడా న్యాయస్థానానికి అందజేశాడు. దీంతో ఈ ఘటన కువైట్ లో సంచలనంగా మారింది. ఐతే కోర్టు ఈ దావాను విచారిస్తుందో లేదా వేచి చూడాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com