‘ది ఘోస్ట్’ సెన్సార్ పూర్తి...
- September 24, 2022
హైదరాబాద్: అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కంటెంట్‌తో వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు ‘ది ఘోస్ట్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టడంతోనే ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. దానికి తగ్గట్టుగా, ఈ సినిమా పోస్టర్స్ డిజైన్ కూడా ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.
కాగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోండటంతో ఈ సినిమా గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా వస్తున్న ఈ సినిమా, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇక ఈ సినిమాలో నాగార్జున ఒక RAW ఏజెంట్‌గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన సరసన అందాల భామ సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటిస్తోండగా, ఈ చిత్రాన్న దసరా కానుకగా అక్టోబర్ 5న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది.
తాజా వార్తలు
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!









